![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -150 లో.. వాళ్ళు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు.. పాపం ఇలా పదహారు రోజుల పండుగ చేసుకోలేదని ప్రేమ, నర్మద బాధపడేలా చేస్తుంది భాగ్యం. ఆ తర్వాత శ్రీవల్లి మెడలో తాళి వేస్తాడు చందు. భాగ్యం పక్కకి తీసుకొని వచ్చి శ్రీవల్లి నగలన్ని తీసుకుంటుంది. చందు, శ్రీవల్లీలతో పాటు అందరు భాగ్యం ఇంటినుండి బయల్దేర్తుంటారు. అక్క నువ్వు వచ్చేటప్పుడు అన్ని నగలు వేసుకొని వచ్చావ్ మరి ఇప్పుడేంటి ఏం నగలు లేవని ప్రేమ అంటుంది.
అవును నగలు ఏవి అని వేదవతి అంటుంది. అంటే అమ్మ లాకర్ లో పెడితే సేఫ్టీ ఉంటుందని తీసుకుందని శ్రీవల్లి అంటుంది. నువ్వు మొదటిసారి మా ఇంటికి కోడలుగా అడుగుపెడుతున్నావని వేసుకొని రా అని వేదవతి అంటుంది. ఇక ఏం చెయ్యలేక భాగ్యం, శ్రీవల్లి లోపలికి వెళ్తారు. భాగ్యం నగలన్నీ వేస్తుంది. నువ్వు ఏం టెన్షన్ పడకు ఈ నగలు టైమ్ చూసి ఇక్కడికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తానని భాగ్యం అంటుంది. ఆ తర్వాత అందరు భాగ్యం ఇంటినుండి వెళ్లిపోతారు. మేమ్ ఆ నగల గురించి టెన్షన్ పడేలా చేసావ్ కదా.. నిన్ను వదిలి పెట్టను ప్రేమ అని భాగ్యం అనుకుంటుంది.
ఆ తర్వాత ప్రేమ, ధీరజ్ ఇద్దరు వస్తుంటే.. బైక్ ఆగిపోతుంది. ప్రేమ ఎండలో ఉండడం వల్ల కళ్ళు తిరిగి పడిపోతుంటే.. ధీరజ్ పట్టుకొని వాటర్ ఇస్తాడు. కొబ్బరి బొండం ఇస్తాడు. బైక్ పక్కన పెట్టి ప్రేమని తీసుకొని ధీరజ్ ఆటోలో ఇంటికి బయలుదేర్తాడు. మరొకవైపు చందు శ్రీవల్లి అందరు ఇంటికి వస్తారు. చిన్నోడు ప్రేమ ఎక్కడ అని వేదవతిని రామరాజు అడుగుతాడు. అప్పుడే ప్రేమ, ధీరజ్ ఆటో దిగి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |